Header Banner

ఇకనైనా ఫేక్ ప్రచారాలు మానుకో..! జగన్‌పై లోకేష్ ఫైర్!

  Sat May 10, 2025 18:35        Politics

ప్రభుత్వ సొమ్ముతో కుట్టుమిషన్లను కొని పసుపు రంగు వేసి అందిస్తున్నారంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Former CM YS Jagan) చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ (Minister Nara lokesh) ఫైర్ అయ్యారు. ఫేక్ పార్టీ వైసీపీకి మంత్రి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ హయాంలో జనం సొమ్ము దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. జనం సొమ్మును కాజేయాలనే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. తాను ఎమ్మెల్యేగా లేని సమయంలో కూడా మంగళగిరి ప్రజలకు స్వ‌యం ఉపాధికి ఆర్థిక సాయంతో చేయూతనందించానని.. అందంతా తన సొంత నిధులతో చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇకనైన ఫేక్ ప్రచారాలు మానుకో అంటూ జగన్‌పై సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా మంత్రి లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

లోకేష్ ట్వీట్ ఇదే..

‘జ‌గ‌న్ అధికారంలో ఉన్న ఐదేళ్లూ ప్ర‌జ‌ల‌ని గాలికి వ‌దిలేసి, జ‌నం సొమ్ము దోచుకోవ‌డమే ప‌నిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. అప్పుడు నేను ఎమ్మెల్యేనీ కూడా కాను. ప్ర‌జ‌ల కోస‌మే పుట్టిన తెలుగుదేశం పార్టీ నాయ‌కుడిగా, నా మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు స్వ‌యం ఉపాధికి చేయూత‌నందించాల‌ని నిర్ణ‌యించుకున్నాను. మ‌హిళ‌లు, చేనేత‌లు, స్వ‌ర్ణ‌కారులు, చిరువ్యాపారుల‌కు అవ‌స‌ర‌మైన సామాగ్రి, ఆర్థిక సాయంతో చేయూత‌నందించాను. వీట‌న్నింటికీ నా సొంత నిధులు వెచ్చించాను. కుల‌, మ‌త అంత‌రాలు పాటించ‌కుండా... త‌మ కాళ్ల‌పై తాము నిల‌బ‌డాల‌నుకునే మ‌హిళామ‌ణులు వేలాది మందికి స్త్రీశ‌క్తి పేరుతో ఉచితంగా శిక్ష‌ణ ఇచ్చాము. ట్రైనింగ్ పూర్త‌య్యాక స‌ర్టిఫికెట్లు, ఉచితంగా టైల‌రింగ్ మిష‌న్‌, మెటీరియ‌ల్ అంద‌జేశాను’ అని చెప్పుకొచ్చారు.

మంగ‌ళ‌గిరి స్త్రీ శ‌క్తి కేంద్రం 2022,జూన్‌20న ప్రారంభించాం. ఈ కేంద్రం ఇప్ప‌టి వ‌ర‌కూ 43 బ్యాచుల్లో 2226 మంది శిక్ష‌ణ పూర్ తిచేసుకోగా, వీరంద‌రికీ మిష‌న్లు అంద‌జేశాం. తాడేప‌ల్లిలో స్త్రీ శ‌క్తి కేంద్రం 2023, ఫిబ్ర‌వ‌రి 1న ప్రారంభ‌మైంది. ఇక్క‌డ 17 బ్యాచుల్లో శిక్ష‌ణ తీసుకున్న 666 మందికి మిష‌న్లు ఉచితంగా ఇచ్చాం. దుగ్గిరాల‌లో 2023 ఏప్రిల్ 10న ఆరంభించిన స్త్రీశ‌క్తి కేంద్రంలో 16 బ్యాచుల్లో 616 మంది ట్రైనింగ్ పూర్తి చేసుకోగా, వీరంద‌రికీ మిష‌న్లు పంపిణీ చేశాం. ఇప్ప‌టి వ‌ర‌కూ 3508 మందికి శిక్ష‌ణ పూర్ తిచేసి, ఉచితంగా నాణ్య‌మైన కుట్టు మిష‌న్లు అంద‌జేశాం. ఇవ‌న్నీ నా జేబులోంచి తీసిన డ‌బ్బులు, నా ఖాతాల నుంచి వెచ్చించిన సొమ్ములు కాబ‌ట్టే...శుభానికి సంకేత‌మైన నా పార్టీ ప‌సుపు రంగు మిష‌న్లు ఇచ్చాను. జ‌నం సొమ్ముతో పెట్టిన ప‌థ‌కాల‌కు నీలా పార్టీ రంగులు, నీ పేర్లు పెట్టుకోవాల‌నే యావ మాకు లేదు. నీ అబ‌ద్ధం తాత్కాలికం. మా నిజం శాశ్వ‌తం. ఇకనైనా ఫేక్ ప్రచారాలు మానుకోవాలి’ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.

ఇది కూడా చదవండి: వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం! కొత్త రేషన్ కార్డ్ తీసుకోవడానికి ఇవే రూల్స్...!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బోర్డర్ లో టెన్షన్ టెన్షన్! ప్రధాని మోదీ ఎమర్జెన్సీ మీటింగ్.. సంచలన నిర్ణయం!

 

అన్నవరం ఆలయంలో వైసీపీ ఎమ్మెల్సీ ఓవరాక్షన్.. వాడువీడు అంటూ అధికారిపై మండిపాటు!

 

3 గంటలు ముందే రావాలి.. ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్‌ సూచన!

 

యుద్ధం.. ఢిల్లీ ఉద్యోగుల సెలవులు రద్దు.. సరిహద్దు ప్రాంతాల్లో హై అల‌ర్ట్‌!

 

ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. టీడీపీ ఎంపీ కుటుంబంలో విషాదం! ఏపీకి చెందిన మరో వ్యక్తి..

 

జగన్ కు ఊహించని షాక్! లిక్కర్ స్కాం లో నిందితులకు సుప్రీంలో చుక్కెదురు!

 

తిరుపతి జిల్లాలో మరో కీలక ప్రాజెక్టు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి!

 

అలర్ట్.. 400కిపైగా ప్లైట్స్ క్యాన్సిల్.. 27విమానాశ్రయాలు మూసివేత.. ఏఏ ప్రాంతాల్లో మూతపడ్డాయంటే..

 

పాక్‌కు యూకే షాక్‌.. వీసాలపై పరిమితులు! కొత్త నిబంధనల్లో భాగంగా...

 

ఏపీలో వారికి గుడ్ న్యూస్..! తల్లికి వందనం ఎప్పటినుంచంటే..?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #Andhrapravasi #LokeshVsJagan #FakeNewsAlert #PoliticalFire #APPolitics #NaraLokesh #JaganReddy #PoliticalWar #TruthMatters